How shares are allot in ipo

INTIAL PUBLIC ISSUE(IPO)

                                         ఇటీవల పలు కంపెనీల ఇష్యూల్లో జారీ చేస్తున్న షేర్లకు కొన్ని రెట్లు అధికంగా బిడ్లు వస్తున్నాయి. శుక్రవారమే ముగిసిన జోమాటో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు 38 రెట్ల స్పందన లభించింది. అలాంట ప్పుడు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఎన్నో కొన్ని షేర్లను ఆయా కంపెనీలు కేటాయిస్తాయా.. ఏ ప్రాతిపదికన షేర్లు కేటాయిస్తారు.. షేర్లు రాని వాళ్లు ఏం చేయాలి? షేర్లకు దరఖాస్తు చేసుకునేందుకు కట్టిన డబ్బులు ఎప్పుడు తిరిగి వస్తాయి.. ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. 

     Ipo కి వచ్చిన స్పందన ఆధారంగానే కేటాయింపు

                                                    


                                               ఐపీఓలో దరఖాస్తు చేసుకున్న మదుపర్లకు ఆ ఇష్యూకు వచ్చిన స్పందన ఆధారంగా, సెబీ నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగు ణంగా షేర్ల కేటాయింపు జరుగుతుంది. ఒక ఇష్యూలో విక్రయానికి పెట్టిన షేర్లకు సమాన స్థాయిలో బిడ్లు లభించాయనుకుందాం. అప్పుడు మదుపర్లు ఎన్ని షేర్లకు బిడ్లు దాఖలు చేస్తే... అన్నింటినీ సదరు కంపెనీ కేటాయిస్తుంది. ఒకవేళ జారీ చేస్తున్న షేర్ల కంటే, ఎక్కువమొ త్తానికి బిడ్లు దాఖలైతే కేటాయింపు ప్రక్రియ సంక్లిష్టం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొందరికి పూర్తిగా షేర్ల కేటాయింపు జరిగితే... ఇంకొందరికీ ఒక్క షేరు కూడా లభించకపోవచ్చు.

    ఎలా కేటాయిస్తారు

పబ్లిక్ ఇష్యూలో జారీ చేసే షేర్లను చిన్న చిన్న లాట్లుగా విభజిస్తారు. షేర్ల సంఖ్యలో కాకుండా లాట్ నే మదుపర్లు దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఒక లాట్లో ఎన్ని షేర్లుండాలి? అనే విషయాన్ని కంపెనీ నిర్ణయిస్తుంది. లాట్లోని షేర్ల కంటే తక్కువ షేర్లకు బిడ్లు వేయడం కుదరదు. షేర్లను కేటాయించేటప్పుడు కూడా లాట్ ని షేర్ల కంటే తక్కువగా కంపెనీ కేటాయించకూడదు. షేర్ల కేటాయింపు విషయంలో 'నైష్పత్తిక ప్రాతిపదిక' అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది.

   ఉదాహరణ

  కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (క్యామ్స్) ఐపీఓనే చూద్దాం. ఈ ఐపీఓకు 46.99 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,28,27,370 షేర్లను జారీ చేయగా.. ఇందులో 63,22,435 షేర్లను చిన్న మదుపర్ల కోసం అట్టే పెట్టారు. అయితే చిన్న మదుపర్లు 3,50,98,056 షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. అంటే వాళ్ల కోసం అట్టేపెట్టిన షేర్ల కంటే 5.55 రెట్లు అధికంగా బిడ్లు వేశారన్న మాట. క్యామ్స్ ఐపీఓలో లాట్కు 12 షేర్లుగా నిర్ణయించారు.

      ఒక పబ్లిక్ ఇష్యూలో జారీ చేసిన షేర్ల కంటే ఎక్కువ షేర్లకు బిడ్లు వస్తే.. చిన్న మదుపర్ల కోసం అట్టేపెట్టిన షేర్లను, కనీస లాట్ పరిమా ణంతో భాగించి ఎన్ని షేర్లను కేటాయించాలో నిర్ణయిస్తారు. ధరల శ్రేణి లోని గరిష్ఠ ధర లేదంటే అంతకుమించిన ధరకు దాఖలు చేసిన బిడ్ లను మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారనే విషయాన్ని గుర్తుం చుకోవాలి. ఈ ప్రకారంగా.. కామ్స్ 63,22,435 షేర్లను (అట్టే పెట్టిన షేర్లు) కనీస లాట్ పరిమాణంలోని 12 షేర్లతో భాగిస్తే వచ్చిన 5,26,869 దరఖాస్తులను మాత్రమే కామ్ షేర్ల కేటాయింపునకు పరిగణ నలోకి తీసుకుంటారు. అయితే మొత్తం దరఖాస్తులు 21,08,682 వచ్చాయి. దీంతో 4:1 (21,08,682, 5,26,869) నిష్పత్తిలో షేర్లను కేటాయిస్తారు. మిగిలిన దరఖాస్తులన్నింటినీ తిరస్కరిస్తారు. అంటే లాటరీ ప్రకారంగా ఈ ప్రక్రియ జరుగుతుందని అనుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో చాలా మందికి ఒక్క షేరు కూడా కేటాయింపు జరగదు.

    షేర్ల కేటాయింపుకుఎంత సమయం పడుతుంది?

సాధారణంగా ఐపీఓ ముగిసిన రోజు నుంచి వారం రోజుల్లోగా షేర్ల కేటాయింపు విధానం ఖరారు అవుతుంది. షేర్ల కేటాయింపు అనంతరం ఆ వివరాలు బీఎస్ఈ లేదా రిజిస్ట్రార్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.

        IPO లో మనకు షేర్లు Allot అయ్యినట్లు మనకు ఎలా తెలుస్తుంది.

కంపెనీ పేరు, పాన్ లేదా దరఖాస్తు సంఖ్య లేదా DG ID / client id వివరాలు పొందుపర్చి, సూచిక (captcha) లోని అక్షరాలను type చేసి submit చేస్తే మనకు షేర్లు కేటాయించారా లేదా అనే విషయం తెలు స్తుంది. ఒకవేళ షేర్లు కేటాయిస్తే.. దరఖాస్తుదారు పేరు, ఎన్ని షేర్లకు దరఖాస్తు చేశారు. ఎన్ని కేటాయించారు. ధర ఎంత, చెల్లించిన డబ్బులో ఎంత సర్దుబాటు చేశారు అనే వివరాలను చూడవచ్చు. ఒకవేళ షేర్లను కేటాయించకుంటే పై వివరాలు ఖాళీగా కనిపిస్తాయి.

        షేర్లను కేటాయించకుంటే మన డబ్బు వాపసు ఎలా వస్తుంది

మదుపర్లకు షేర్లను కేటాయిస్తే.. అప్పుడు దరఖాస్తు సమయంలోచెల్లించిన డబ్బులోంచి ఆ షేర్ల కోసం మినహాయించుకుంటారు. ఒకవేళ షేర్లను కేటాయించకుంటే.. ఆ డబ్బులను రిఫండ్గా ఇస్తారు. ఇప్పుడు దరఖాస్తుదార్ల డబ్బు బ్యాంక్ ఖాతాలో నుంచి తీయడం లేదు. అయితే షేర్ల కేటాయింపు జరిగే వరకు అందుకు కేటాయించిన డబ్బు లాక్ అయి ఉంటుంది. షేర్లు కేటాయిస్తే, అందుకు కావాల్సిన మొత్తం సదరు కంపెనీ ఖాతాకు వెళ్తుంది. లేకపోతే మన ఖాతాలోనే ఉంటుంది కనుక వాడుకోవచ్చు.

       TRADING ఎప్పుడు చేయాలి

  ఐపీఓ ముగిసిన తేదీ నుంచి ఐదు రోజుల్లోగా వారి డి-మ్యాట్ ఖాతా లోకి షేర్లు జమ అవుతాయి. ఎక్స్ఛేంజీలో నమోదైన రోజు నుంచే షేర్లను TRADE చేయొచ్చు.