సాయం
సాయంత్రం 5 గంటలు దాటింది నగరానికి 20కి.మీ దూరంలో కారు వేగంగా దూసుకొస్తుంది.
శ్యామల చాలా పరధ్యానంగా ఉంది.మనసు నిండా ఇంటి వద్ద నిన్న జరిగిన విషయం గురించే ఆ ఆలోచనల తోనే కారును నడుపుతోంది. తను నడిపి 4 సంవత్సరాలు అయింది.తన డ్రైవర్ రామునే నడిపేవాడు.అతని గురించే ఇప్పుడు ఆలోచన.ఎంతో నమ్మకంగా వుండేవాడు.ఏమైందో ఏమో నిన్న తను ఇంట్లో లేనప్పుడు 5 లక్షలు రూపాయలు తీసుకొని అడ్డువచ్చిన అమ్మను కూడా నెట్టేసి వెళ్ళిపోయాడు.
దానికి తోడు తన భర్త విజయ్ సరిగా పట్టించుకోడు.ఎప్పుడూ కంపెనీ పనుల మీద ఇంట్లో ఉండడు.శ్యామల కూడా ఒక చిన్న software కంపెనీకి యజమాని తన వద్ద చాలా మంది పనిచేస్తున్నారు.రాము తనను అడిగితే ఆ 5 లక్షలు ఇచ్చేది ఇలా మోసం చేయటం ఎందుకు అని బాధ.
ఒక్కసారిగా కారు అదుపు తప్పింది టైర్కి పంచర్ కావటంతో. ఎలాగో కంట్రోల్ చేసి రోడ్డు పక్కన ఆపింది.అది మెయిన్ రోడ్ కాకపోవడంతో ట్రాఫిక్ లేదు.తన స్నేహితురాలి ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ కి హాజరు అయ్యి వస్తుంది.అది నగరానికి 40 km దూరంలో ఉన్న చిన్న గ్రామం.సుమారు 40 నిమిషాల నుండి ఎదురు చూస్తోంది.ఎవరూ ఆ రోడ్ వెంట పోలేదు.అది శీతాకాలం కావటంతో 6 గంటలు కాకముందే చీకటి పడుతోంది.
ఏం చేయాలో అర్థం కాలేదు తనకు టైర్ మార్చటం రాదు.వెనుక డిక్కీలో ఉన్న టైర్ కింద వేసింది.దాని పైన కూర్చొని ఎదురు చూస్తూ ఉంది.ఎవరికైనా ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ లేవు.మసక చీకటిగా ఉంది అప్పుడే ఒక వ్యక్తి వచ్చాడు.సుమారు ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటాడు.ముఖం ఆ వెలుతురు లో సరిగా కనిపించటం లేదు.ఏందీ ఇక్కడ ఆగారు అని అడిగాడు.
ఎదో తెలియని భయంతో సరిగా సమాధానం చెప్పలేక కారు కి పంచర్ అయ్యింది అని చెప్పింది.అప్పుడు అతను ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం చీకటి పడితే ఎవరూ రారు అని అన్నాడు.
సరే నేను బాగు చేస్తా అని కారులోని టూల్ కిట్ తీసుకుని టైర్ మార్చటం మొదలు పెట్టాడు.చీకటి గా వుండటం తో తన ఫోన్ లైట్ను on చేసింది.కానీ మనసులో ఎదో భయం ఎంతోకాలం నుండి తన వద్ద పనిచేస్తున్న వాడే డబ్బుకోసం మోసం చేశాడు ఇప్పుడు ఎవరో ముక్కు,ముఖం తెలియని వ్యక్తి ఎలాంటివాడో ఏమో అని.
కష్టపడి టైరు ను మార్చాడు.ఫోన్ వెలుతురు లో అతని మోచేతులు గీరుకున్నట్టు కనిపించింది.నాకు ఇదే కొత్త అందుకే లేట్ అయ్యింది అని మీరు ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి కదా, మా ఇంటి దగ్గర కొంచెం టీ తాగి వెళ్ళండి మాది ఈ పక్క ఊరే ఒక కిలోమీటర్ లోపే ఉంటుంది. మొదట వచ్చే పచ్చ రంగు ఇల్లు, ఇంటి ఎదురు స్థంభం ఉంటుంది. అని చెప్పి డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు.ఇది నేను డబ్బుల కోసం చేయలేదండి. నాకు చేతనైన సాయం నేను చేశాను అంతే అని బయలు దేరాడు.
కార్ స్టార్ట్ చేసి అతను చెప్పిన ఇంటి ముందు ఆగింది.కార్ దిగి ఇంటి వద్దకు వచ్చే లోపు అతను సైకిల్ పై వచ్చేశాడు.శాంతి అని పిలిచాడు లోపలి నుండి అతని భార్య 9 నెలల గర్భవతి బయటికి వచ్చింది.అమ్మగారికి కొంచెం మంచి నీళ్ళు ఇచ్చి టీ ఇవ్వు అన్నాడు. ఆమె అలాగే అని నీళ్లు తీసుకొని ఇచ్చి టీ పెట్టడం ప్రారంభించింది.అతని మోచేతి గాయాన్ని చూసి ఎందయ్య ఏమయ్యింది అని, దానిపై పసుపు వేస్తూ అడిగింది అది ఏమి లేదులే.చిన్న గీతలేగా, టైరు మారిచేటప్పుడు రోడ్డు గీసుకొని వుంటాదిలే నీవు కంగారు పడకు అని నచ్చచెప్పాడు.
చాలా చిన్న ఇల్లు అతనికి 25 సంవత్సరాల లోపే ఉంటాయి చాలా బీదరికం లో ఉన్నారని చూడగానే తెలుస్తుంది.టీ ఇచ్చాక శాంతి మందులు వేసుకున్నవా అని అడిగాడు ఆమె ఆ అని సమాధానం చెప్పింది. డాక్టరు వద్దకు వెళ్ళాను వారం లో ఆపరేషన్ చేయాలి అని అంది దానికి సుమారు 20000 వరకు అవుతాయంట మీరు ఇచ్చినవి నా దగ్గర 5000 మాత్రమే ఉన్నాయి అని చెప్పింది. వాళ్లిద్దరూ అలా చిన్నగా, వినపడకుండా మాట్లాడుకోవడం చూసి వాళ్లు ఏదొ ఇబ్బందులలో వున్నారు అని గ్రహించింది శ్యామల.పక్కనే ఉన్న డాక్టర్ రాసిచ్చిన మందుల చీటిని చూసింది.బయలు దేరుతూ వాళ్ళకి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పింది.
కారులో పోతూ ఆ జంట గురించి ఆలోచించసాగింది.ఎంత కష్టం ఉన్న తమలో తామే బాధపడటం తప్ప పక్కవారికి తెలియనివ్వక పోవటం,వారి ప్రేమ తన మనస్సును కరిగించాయి.వెళ్లే దారిలో ఆ చీటీలో చూసిన హాస్పిటల్ కనిపించింది.లొపలికి వెళ్లి డాక్టర్ను శాంతి ఆరోగ్యం గురించి అడిగింది.ఆమె ఆపరేషన్ గురించి చెప్పినది విని ఆ సాయం చేయాలి అని నిర్ణయించుకుంది.
ఆపరేషన్ కి రేపు వెళ్ళాలి అనగా శాంతి కి ఒక కవర్ పోస్టుమాన్ తీసుకువచి ఇచ్చాడు. మాకు ఉత్తరం రాసే వారు ఎవరు అని తెరిచి చూడగానే అందులో 30 వేల రూపాయల డబ్బులు చిన్న లెటర్ లో పుట్టబోయే వారి కోసం నేనిచ్చే చిన్న కానుక అని రాసి ఉంది. వాళ్ళకి కళ్ళవెంట నీళ్లు తిరిగాయి.
ఎవరికైనా ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయం మనకు ఎప్పుడో కప్పుడు ఎదో రూపంలో మనకు మేలు చేస్తుంది.
Post a Comment